
కోపెన్ హాగెన్‍లో
దేవతలు సమావేశమవుతున్నారనుకున్నాను
కానీ
అక్కడా మనుషులే.
చర్మం మీదా జీవితం మీదా
పొరలు పొరలుగా అట్టలు కట్టిన
లక్షల టన్నుల కార్బన్‍డయాక్సైడ్‍తో
అక్కడా మనుషులే.
పంచేంద్రియాల నుండి
గ్రీన్ హౌస్ గ్యాసెస్..
మరి ప్రసంగాలు మాత్రం
ప్రాణవాయువు మీదే.
భవిష్యత్తు గురుంచి
దేవుడు మాట్లాడుతున్న శిఖర సమావేశంలో
మృత్యువే ముఖ్య అతిథి.
కనీసం
డెన్మార్కులోనైనా
ఒక సన్మార్గం దొరుకుతుందనుకున్నాను
అక్కడా మనుషులే
పిల్లల చేతుల్లో భూగోళం...
వేటగాడిని చూసి వణికిపోతున్న పిట్టలా.
[విఫలమైన కోపెన్ హాగెన్ సమావేశానికి నిరసనగా]
No comments:
Post a Comment